
ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ (54) శుక్రవారం చెన్నై హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. రెండు వారాల క్రితం కరోనా లక్షణాలతో ఊపిరాడక ఛాతి నొప్పితో బాధపడ్డారు. రెండు వారాల క్రితం కేవీ ఆనంద్ భార్య, కూతురు కూడా కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. అప్పటినుండి వారు హోం క్వారెంటైన్ లో ఉన్నట్టు సమాచారం. ఛాతిలో నొప్పి రావడంతో స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ చెన్నై హాస్పిటల్ వెళ్లిన డైరక్టర్ కేవీ ఆనంద్ అక్కడ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. కేవీ ఆనంద్ కు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
డైరక్టర్ కేవీ ఆనంద్ మృతి పట్ల సినీ సెలబ్రిటీలు సంపాతం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరో అల్లు అర్జున్ డైరక్టర్ కేవీ ఆనంద్ లేరన్న వార్తతో నిద్ర లేచాను.. అద్భుతమైన కెమెరామెన్, గొప్ప దర్శకుడు.. మంచి మనిషిని కోల్పోయాం అంటూ ట్వీట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసిన కేవీ ఆనంద్ డైరక్టర్ గా కూడా మంచి సినిమాలు అందించారు. రంగం, శివాజీ, బందోబస్త్ కేవీ ఆనంద్ డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందాయి.