
సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ముందు వెనక ఎన్ని సినిమాలు వచ్చినా ఆయన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అంటే పోకిరి అని అందరు చెబుతారు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ముందు మహేష్ క్రేజ్ వేరు.. ఈ సినిమా తర్వాత మహేష్ క్రేజ్ వేరు.. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్ని బద్ధలు కొట్టిన సినిమా పోకిరి.
పూరీ జగన్నాథ్ మొదటి సినిమా బద్రి కన్నా ముందు ఈ సినిమా కథ రాసుకున్నారట. అయితే ముందు ఈ సినిమాను కూడా రవితేజతో చేయాలని అనుకున్నారట. సినిమాకు టైటిల్ గా ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అని పెట్టాలని అనుకున్నాడట పూరీ. అయితే సినిమా కథ మహేష్ దగ్గరకు రావడం ఆయన ఓకే చెప్పడం.. టైటిల్ దగ్గర నుండి ముందు హీరోయిన్ గా అనుకున్న అయేషా టకియా కూడా మారి ఇలియానా ఛాన్స్ కొట్టేసింది.
ఫైనల్ గా మహేష్ కెరియర్ లో పోకిరి ఓ ట్రెండ్ సెట్టర్ సినిమా అయ్యింది. అప్పటివరకు కామన్ గా అభిమానించే కొందరు ఫ్యాన్స్ మహేష్ అభిమానులుగా మారారంటే అది పోకిరి సినిమా వల్లే అని చెప్పొచ్చు. 15 ఏళ్లు కాదు మహేష్ ఎన్ని సినిమాలు చేసినా పోకిరి ఎప్పటికీ స్పెషల్ అని చెప్పొచ్చు.