
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. రవితేజ బ్లైండ్ మెన్ గా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మళ్ళీ వరుసగా ఐదారు ఫ్లాపులు తీశాడు. ఈమధ్యనే క్రాక్ తో తిరిగి ఫాం లోకి వచ్చాడు రవితేజ. ఇక లేటెస్ట్ గా రవితేజ, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో రాజా ది డబుల్ గ్రేట్ సినిమా వస్తుందని తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమా సీక్వల్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
రాజా ది గ్రేట్ సినిమా కథని కొనసాగిస్తూ పార్ట్ 2 ఉంటుందా లేక మరో కొత్త కథతో ఈ సినిమా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాజా ది గ్రేట్ పార్ట్ 2గా రాజా ది డబుల్ గ్రేట్ అని తీస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. త్రినాథ రావు సినిమా తర్వాత అనీల్ రావిపుడితో సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్.