
స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. తనకు కరోనా పాజిటివ్ వచినట్టుగా స్వయంగా అల్లు అర్జున్ తన సోషల్ బ్లాగుల్లో ప్రకటించారు. తనని ఈమధ్య కాలం కలిసిన వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే బన్నీ కోసం ప్రార్ధనలు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అసలైతే పుష్ప సినిమాను ఆగష్టు 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తే సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవడం కష్టమే అని చెప్పొచ్చు.