
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా టీజర్ ద్వారా తన ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ వేసుకున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న పుష్ప సినిమా నుండి వచ్చిన పుష్ప రాజ్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అంతేకాదు టీజర్ రిలీజైన అతి తక్కువ టైం లో 50 మిల్లియన్ వ్యూస్ రాబట్టింది. సౌత్ సినీ పరిశ్రమలో ఈ రికార్డ్ అందుకున్న ఫస్ట్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని అంటున్నారు.
ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న పుష్ప సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న టైం కు రావడం కష్టమని అంటున్నారు.