
బండ్ల గణేష్ అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం గొంతుచించుకుని స్పీచ్ లు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదు ఒకప్పుడు అతను కూడా ఆర్టిస్ట్ గా హీరోల పక్కన చేసిన విషయం కూడా తెలిసిందే. కమెడియన్ గా మెప్పించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. అయితే బండ్ల గణేష్ లీడ్ రోల్ లో ఓ సినిమా వస్తుందని అంటున్నారు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ మండేలా రీమేక్ లో బండ్ల గణేష్ నటిస్తున్నాడని టాక్.
తమిళంలో కమెడియన్ యోగి బాబు నటించిన ఈ సినిమాను మదోన్నే అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను తెలుగులో బండ్ల గణేష్ తో చేయాలని చూస్తున్నారట. 2020 లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి అలరించాడు బండ్ల గణేష్. మరి అక్కడ యోగి బాబుకి హిట్ ఇచ్చిన ఆ సినిమా తెలుగు వర్షన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.