
సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా నుండి క్రేజీ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. సినిమా రెండు షెడ్యూల్ పూర్తి చేసుకోగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఈలోగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతం కావడంతో షూటింగ్స్ ను ప్రస్తుతానికి ఆపేశారు. ఇక ఇదిలాఉంటే సర్కారు వారి పాట సినిమా నుండి త్వరలోనే టీజర్ రాబోతుందని అంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మే 31న సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మహేష్ మరోసారి మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. మహేష్ మాస్ లుక్ అనగానే సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు పెరిగాయి.