పుష్ప సినిమాలో ఐశ్వర్య రాజేష్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. సినిమా పరిచయ వేదిక అదేనండి పుష్ప రాజ్ ను పరిచయం చేసి రికార్డులు కొట్టడంలో తగ్గేదిలే అన్నట్టు టీజర్ తోనే సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మికతో పాటుగా మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.

సినిమాలో కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తుందని అంటున్నారు. సినిమాలో ఆమెది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని టాక్. అంతేకాదు పుష్ప మూవీలో పుష్ప రాజ్ చెల్లి పాత్రలో ఐశ్వర్య నటిస్తుందని.. ఆ పాత్ర సినిమా మధ్యలోనే చనిపోతుందని అంటున్నారు. మొత్తానికి తెలుగులో ఓ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ఐశ్వర్య రాజేష్ కు లక్కీ ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ నటించింది.