
ఆచార్య సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా డైరక్షన్ లో లూసిఫర్ రీమేక్ గా ఓ సినిమా వస్తుండగా కె.ఎస్ రవింద్రా అలియాస్ బాబీ డైరక్షన్ లో చిరు సినిమా ఉంటుందని తెలిసిందే. ఇక ఈ సినిమాలతో పాటుగా మెహెర్ రమేష్ తో కూడా మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇదే కాదు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరక్షన్ లో చిరు సినిమా చేస్తారని లేటెస్ట్ టాక్. రీసెంట్ గా సందీప్ చిరుకి ఓ కథ వినిపించారట. స్టోరీ నచ్చిన మెగాస్టార్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించిన సందీప్ అదే సినిమాను హిందీలో తీసి అక్కడ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్న సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమాను చిరుతో చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. మెగాస్టార్ తో అర్జున్ రెడ్డి డైరక్టర్ సినిమా ఓకే అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.