
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమ మీద కరోనా ప్రభావం మళ్ళీ పడుతుంది. ఇప్పటికే చాలమంది స్టార్స్ కరోనా బారిన పడి రికవరీ అవుతుండగా లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. బుట్ట బొమ్మ పూజా హెగ్దే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తనను ఈమధ్య కాలంలో కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అంతేకాదు తన గురించి ప్రాధనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పింది పూజా హెగ్దే.
ప్రస్తుతం అమ్మడు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో నటిస్తుంది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా పూజా హెగ్దే నటించింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దే స్టార్ సినిమా అంటే ముందు ఆమెని అడిగి కాదన్న తర్వాతే వేరే హీరోయిన్ కు ఆ ఆఫర్ వెళ్తుందని తెలుస్తుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది పూజా హెగ్దే. సినిమాకు ఆమె రెండున్నర కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.