
జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా థ్యాంక్ యు బ్రదర్. విరాజ్ అశ్విన్ మేల్ లీడ్ గా నటించిన ఈ సినిమా అసలైతే ఏప్రిల్ 30న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఇలాంటి టైం లో సినిమాలన్ని వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో థ్యాంక్ యు బ్రదర్ కూడా థియేటర్ రిలీజ్ వాయిదా వేసుకుంది. అయితే సినిమాకు ఆహా ఓటిటి నుండి ఫ్యాన్సీ ఆఫర్ రావడంతో ఆహాలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
రమేష్ రాపర్తి డైరక్షన్ లో తెరకెక్కిన థ్యాంక్ యు బ్రదర్ సినిమా ముందు థియేటర్ రిలీజ్ చేయాలని అనుకున్నా సినిమాను థియేటర్ రిలీజ్ చేయడం కష్టమని భావించి ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమా ఓటిటిలో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మే 7న ఆహా ఓటిటిలో థ్యాంక్ యు బ్రదర్ రిలీజ్ అవుతుంది. అనసూయ మాత్రం ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు.