
మిల్కీ బ్యూటీ తమన్నా 15 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటికీ సూపర్ బిజీగా ఉంటుంది. మధ్యలో కొన్నాళ్లు కెరియర్ లో వెనకపడినట్టు అనిపించినా మళ్ళీ వరుస అవకాశాలు రాబట్టుకుంటుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న అమ్మడు ఇన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ మీదే సత్తా చాటగా లేటెస్ట్ గా డిజిటల్ స్క్రీన్ మీద కూడా అడుగు పెట్టింది. తెలుగు ఓటిటి ఆహా కోసం లెవెన్త్ అవర్ వెబ్ సీరీస్ లో నటించింది తమన్నా. గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ ఈమధ్యనే ఆహాలో రిలీజైంది. తమన్నా ఉంది కాబట్టి ఓ సినిమాకు ప్రమోట్ చేసినట్టుగానే చేశారు ఆహా టీం.
ఇక తమన్నాతో వెబ్ సీరీస్ వర్క్ అవుట్ అవుతుందని భావించిన ఆహా టీం ఆమెతో మరో వెబ్ సీరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారట. కరోనా లాక్ డౌన్ లో బాగా ఫేమస్ అయిన ఆహా కంప్లీట్ ఎంటర్టైనర్ గా మారుతుంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని పరిస్థితి ఉన్నప్పుడు అమేజాన్, నెట్ ఫ్లిక్స్ ల కన్నా తెలుగు ఆడియెన్స్ కు ఆహానే ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది. అందుకే వరుస వెబ్ సీరీస్, చిన్న సినిమాలను కొని రిలీజ్ చేస్తున్నారు. తమన్నాతో లెవెన్త్ అవర్ సక్సెస్ అవడంతో మరో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దానికి సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.