
ఆది సాయి కుమార్ హీరోగా బలవీర్ డైరక్షన్ లో ఓ సినిమా మొదలైంది. ఈ సినిమాకు టైటిల్ గా అమరన్ అని ఫిక్స్ చేశార్. ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఆది సాయి కుమార్ కు జోడీగా అవికా గోర్ నటిస్తుంది. ఆది, అవికా మొదటిసారి జోడీ కడుతున్న ఈ సినిమా క్రేజీగా ఉంటుందని అంటున్నారు.
సినిమాలో ఆది పాత్ర వెరైటీగా ఉంటుందని అంటున్నారు. ఆడియెన్స్ ఎంగేజ్ అయ్యే కథతో.. థ్రిల్లర్.. ఫాంటసీ కథాంశంతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్ గా శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ఆ సినిమాతో నిరాశపరచాడు. ఈమధ్యనే వీభద్రం చౌదరి డైరక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టిన ఆది సాయి కుమార్ మరో సినిమాను లైన్ లో పెట్టాడు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆది మాత్రం వరుస సినిమాలతో ఫుల్ జోష్ కనబరుస్తున్నాడు.