
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో అందరికి తెలిసిందే. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరో పక్క పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మాస్క్ ఈజ్ మస్ట్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది తెలంగాణా పోలీస్ డిపార్ట్ మెంట్. ఇప్పటికే మాస్క్ లేకుండా కనిపించిన వారికి 1000 రూపాయల ఫైన్ చేస్తుండగా లేటెస్ట్ గా మహేష్ బాబు వాయిస్ తో ఓ స్పెషల్ మెసేజ్ రిలీజ్ చేసింది. మహేష్ బిజినెస్ మేన్ లోని జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు.. బీ అలర్ట్.. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.. వేర్ మాస్క్ అంటూ డైలాగ్ రిలీజ్ చేయించారు.
అంతేకాదు ఈ వీడియోకి మాస్క్ వేసుకున్న మహేష్ పిక్ పెట్టారు. మాస్క్ ఈజ్ మస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియో తెలంగాణా స్టేట్ పోలీస్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తెలంగాణా పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రజల్లో చైతన్యం కలిగించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
#MaskIsMust@urstrulyMahesh pic.twitter.com/L4AzI0JBvO