నెట్ ఫ్లిక్స్ లో నాగార్జున వైల్డ్ డాగ్ ట్రెండింగ్..!

నాగార్జున హీరోగా ఊపిరి రైటర్ సోల్మన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా వైల్డ్ డాగ్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. కరోనా లాక్ డౌన్ టైం లో సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని జనవరి నుండి సినిమాలు రిలీజ్ అవుతూ సక్సెస్ అవడంతో నాగార్జున వైల్డ్ డాగ్ ను థియేటర్ రిలీజ్ చేయించారు. ఏప్రిల్ 2న థియేటర్ లో రిలీజైన వైల్డ్ డాగ్ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఓ పక్క కరోనా ప్రభావం పెరగడంతో నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడ్డది.

ఇక లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ చేశారు. తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమా అందుబాటులో ఉంది. థియేటర్ లో అలరించని ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇండియా వైడ్ వైల్డ్ డాగ్ తెలుగు వర్షన్ టాప్ 2 లో ట్రెండింగ్ లో ఉండగా తమిళ వర్షన్ 5వ స్థానంలో ఉంది. నాగ్ చేసిన ఈ ప్రయత్నం వెండితెర మీద సక్సెస్ అవకపోయినా డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ హైలెట్ గా నిలిచిందని తెలుస్తుంది.