లేడీ డైరక్టర్ తో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ టాలెంటెడ్ లేడీ డైరక్టర్ సుధ కొంగరతో సినిమా చేస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన సుధ కొంగర మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. రీసెంట్ గా మహేష్ ను కలిసి ఆ లైన్ వినిపించినట్టు తెలుస్తుంది. సుధ కొంగర చెప్పిన లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట మహేష్. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. జక్కన్న సినిమా స్టార్ట్ చేసే గ్యాప్ లో త్రివిక్రం తో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు మహేష్. 

త్రివిక్రం తో పాటుగా సుధ కొంగర డైరక్షన్ లో కూడా మహేష్ సినిమా చేస్తాడని అంటున్నారు. అంటే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయడానికి ముందే మహేష్ రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. త్రివిక్రం సినిమాతో పాటుగా సుధ కొంగర సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలో వస్తుందని అంటున్నారు.