
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే టీజర్ తో అదరగొట్టిన బాలయ్య బాబు సినిమా బిజినెస్ తో కూడా తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తున్నారు. సినిమాకు శాటిలైట్ రైట్స్ 16 కోట్ల దాకా రాగా అఖండ సినిమా డిజిటల్ రైట్స్ ను 65 కోట్లకు అడిగారట. ప్రముఖ ఓటిటి నుండి అఖండ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం భారీ ఆఫర్ ఇచ్చారట.
అయితే సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉన్న నిర్మాతలు ఆ ఆఫర్ ను కాదన్నారట. బాలయ్య సినిమాకు 65 కోట్ల డిజిటల్ రైట్స్ అంటే మంచి ఆఫర్ అని చెప్పాలి. అయితే అఖండ టీజర్ చూసి ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా తప్పకుండా ఆ ఇద్దరి కాంబో మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అంటున్నారు.