
రాజమౌళి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా RRR. బాహుబలి తర్వాత ఆ సినిమాను మించి భారీ అంచనాలతో RRR తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సినిమా నుండి వచ్చిన టీజర్లు ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం టీజర్ సరికొత్త రికార్డులు సృష్టించింది.
సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. 2020 అక్టోబర్ 22న కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ తో సత్తా చాటుంది. తెలుగు సినిమాల్లో ఏ టీజర్ కూడా 50 మిలియన్ వ్యూస్ రాబట్టలేదు. అలాంటి అరుదైన రికార్డ్ సాధించింది ఆర్.ఆర్.ఆర్. కొమరం భీమ్ టీజర్ తో పాటుగా రామ రాజు టీజర్ కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమాపై క్రేజ్ పెంచింది.