
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఐదవ సీజన్ కి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. జూన్ రెండో వారం నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 స్టార్ట్ అవుతుందని అన్నారు. కాని ప్రస్తుతం కరోనా తీవ్రత పెరగడం.. సినీ పరిశ్రమలో చాలమందికి కరోనా సోకడం మళ్లీ షూటింగ్స్, టివి షోస్ అన్ని క్యాన్సల్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5ని కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది.
ఈ సీజన్ లో కూడా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీస్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ కరోనా టైం లోనే బిగ్ బాస్ షో నడిపించారు. ఈసారి కూడా అలానే సీజన్ 5 మొదలు పెట్టాలని చూస్తున్నారు. అయితే సీజన్ 5 అనుకున్నట్టుగా జూన్ లో కాకుండా మరో రెండు నెలలు అంటే ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మొదలయ్యే ఛాన్స్ ఉందని టాక్.