
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేశారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యా నాగల్ల నటించారు. ఏప్రిల్ 9న రిలీజై మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్ వసూళ్ల పరంగా కూడా పవన్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది.
ఇక ఈ సినిమా థియేటర్ లో చూడని వాళ్లు డిజిటల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అమేజాన్ ప్రైం వకీల్ సాబ్ సినిమాను భారీ రేటుకి కొనేసింది. థియేటర్ లో హడావిడి తగ్గగా అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మే 7న వకీల్ సాబ్ డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా వకీల్ సాబ్ సత్తా చాటుతాడని చెప్పొచ్చు.