సోనూసూద్ కు నెగటివ్..!

ప్రముఖ నటుడు సోనూ సూద్ కు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సోనూ సూద్ కు కరోనా అనగానే చాలామంది అభిమానులు ఆందోళన చెందారు. లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ టైం లో వలస కార్మికులను దేవుడిలా ఆదుకున్న సోనూసూద్ అప్పటి నుండి తన సేవా కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సహాయం అడిగిన వారికి తనవంతుగా సహాయం చేస్తున్న సోనూ సూద్ చివరకు కరోనాని జయించారు. 

లేటెస్ట్ గా కరోనా టెస్ట్ చేయించుకున్న సోనూ సూద్ కు కరోనా నెగటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన సోషల్ బ్లాగుల్లో పెట్టాడు సోనూసూద్. సోనూ సూద్ కు కరోనా నెగటివ్ అనగానే ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. రీసెంట్ గా కరోనాతో బాధపడుతున్న నాగ్ పూర్ వ్యక్తిని ఎయిర్ ఆంబులెన్స్ ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ లో చికిత్స ఏర్పాట్లు చేశారు సోనూ సూద్. తన జీవితం సేవకే అంకితం అన్నట్టుగా తన నోటీస్ కు వచ్చిన ప్రతి సమస్యకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు సోనూసూద్.