
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా కోసం ముందు కలకత్తాలోనే షూటింగ్ ప్లాన్ చేయగా ఇప్పుడు అక్కడకెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదని హైదరబాద్ లోనే సెట్ వేస్తున్నారు. కాళీ మాత సెట్ భారీగా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సెట్ లో సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ డీల్స్ వస్తున్నాయి. సినిమాకు 30 కోట్లకు డిజిటల్, శాటిలైట్ డీల్స్ వచ్చాయని తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే నాని సినిమా మంచి హడావిడి చేస్తుంది. నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాతో పాటుగా నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.