పుష్పలో రంగస్థలం రంగమ్మత్త..!

స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతూ సిల్వర్ స్క్రీన్ పై కూడా క్రేజ్ తెచ్చుకుంటున్న అనసూయ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రాం చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా స్పెషల్ రోల్ తో ఎట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు. పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్న అనసూయ ఆన్ షూట్ లొకేషన్ పిక్స్ షేర్ చేసింది.

జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన అనసూయ. స్మాల్ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఓ చిన్నపాటి హీరోయిన్ కు ఉన్న ఇమేజ్ సంపాదించిన అనసూయ అటు స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా టాలెంట్ చూపిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టిన అనసూయ పుష్ప సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని అంటున్నారు. మరి పుష్ప సినిమాలో అనసూయ పాత్ర ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.