సెల్ఫ్ ఐసోలేషన్ లో మహేష్ బాబు..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత సినీ పరిశ్రమ మీద బాగా చూపిస్తుంది. ఇప్పటికే అన్ని షూటింగులు క్యాన్సిల్ చేయగా లేటెస్ట్ గా స్టార్ హీరోల్లో కొందరు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. తన వ్యానిటీ డ్రైవర్ కరోనాతో మృతి చెందడంతో రాం చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్ కు కరోనా సోకగా ప్రభాస్ కూడా క్వారెంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక మహేష్ పర్సనల్ స్టైలిస్ట్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో రీసెంట్ గా ఓ షెడ్యూల్ స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో మహేష్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చిందట. మహేష్ టీం లో ఒకరికి పాజిటివ్ రాగానే మహేస్ బాబు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. వీతితో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా క్వారెంటైన్ టైం గడుపుతున్నట్టు తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ స్టార్స్ కు ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు.