దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశారు. పుష్ప సినిమాకు ముందే ఈ సినిమా ఎనౌన్స్ చేసినా సుకుమార్ తో పుష్ప సినిమా ఫినిష్ చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ చేస్తాడని అనుకున్నారు. కాని సడెన్ గా కొరటాల శివ డైరక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. కొరటాల శివ సినిమా కన్నా ముందు వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎనౌన్స్ చేసిన ఐకాన్ గురించి లైట్ తీసుకున్నాడు బన్నీ.
రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు కూడా ఐకాన్ అల్లు అర్జున్ తోనే ఉంటుందని చెప్పినా అతను డేట్స్ ఇవ్వకుంటే వేరే హీరోతో చేస్తామని అన్నారు. అయితే పుష్ప టీజర్ కోసం స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టర్ గా మార్చేశారు. అలాంటిది ఐకాన్ టైటిల్ తో వస్తున్న సినిమాను బన్నీ ఎలా మిస్ చేసుకుంటాడని కొందరి వాదన. ఐకాన్ అల్లు అర్జున్ అవుతాడా కాదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.