బాలయ్య అఖండ అదిరిపోయే బిజినెస్..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అఖండ. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్ యూట్యూబ్ లో సెన్సేషస్ క్రియేట్ చేయగా సినిమా బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో చేస్తుందని తెలుస్తుంది.

అఖండ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా 16 కోట్లకు కొనేసిందని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమాలో ఈ రేంజ్ లో సినిమా సేల్ అవడం ఇదే మొదటిసారి. సక్సెస్ ఫుల్ కాంబో అవడంతో పాటుగా అఖండ టీజర్ తో అంచనాలు పెరగడంతో బాలయ్య సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. సినిమా డిజిటల్, థియేట్రికల్ రైట్స్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సిం హా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.