
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా రాధే. ప్రభుదేవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాలోని సీటీమార్ సాంగ్ వినిపించింది. సినిమాలో ఈ సాంగ్ ను వాడేసుకున్నారు సల్మాన్ ఖాన్. దేవి మ్యూజిక్ అందించిన డీజేలోని ఆ సాంగ్ ను రాధే సినిమాలో రిపీట్ చేశారు.
ఇదివరకు కూడా రింగ రింగ సాంగ్ ను కూడా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఆడియెన్స్ కోసం వాడేశారు. లేటెస్ట్ గా సీటీమార్ సీటీమార్ సాంగ్ ను రాధే కోసం రిపీట్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఇలా అడపాదడపా బాలీవుడ్ ఆడియెన్స్ ను కూడా తన టాలెంట్ తో మెప్పిస్తున్నాడని చెప్పొచ్చు. దిషా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఓటిటి, సిల్వర్ స్క్రీన్ రెండిటిలో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.