OTT లో టక్ జగదీష్.. కుదరదనేసిన నాని..!

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో నాని సరసన ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటించారు. అసలైతే ఏప్రిల్ 23న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా మారడంతో సినిమా రిలీజ్ వాయిదా వేశారు. అయితే నాని సినిమాకు కరోనా గండం ఉన్నట్టు ఉంది. లాస్ట్ ఇయర్ కూడా వి సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేశారు.. రిలీజ్ కు సరిగ్గా వారం ముందు లాక్ డౌన్ చేశారు.

ఇక ఇప్పుడు కూడా జనవరి నుండి మార్చ్ ఎండింగ్ వరకు అంతెందుకు ఏప్రిల్ 9న రిలీజైన వకీల్ సాబ్ వరకు పరిస్థితి బాగానే ఉన్నా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో సినిమాలు వాయిదా వేశారు. థియేటర్లు కూడా స్వచ్చంధంగా మూసివేసే పరిస్థ్తి వచ్చింది. అయితే ఇలాంటి టైం లో నాని టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై నాని సీరియస్ అవుతున్నారని తెలుస్తుంది. టక్ జగదీష్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓటిటిలో రిలీజ్ చేసేది లేదని నాని అంటున్నాడట. లాస్ట్ ఇయర్ ఓటిటిలో రిలీజైన వి సినిమా నిరాశపరచింది. అందుకే నాని తన సినిమా ఓటిటి లో రిలీజ్ అంటే మాత్రం ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది.