
జోగిపేట్ శ్రీకాంత్ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ హైదరాబాద్ వచ్చి చేసిన హంగామా అందరికి తెలిసిందే. అనుదీప్ కెవి డైరక్షన్ లో జాతిరత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన నవ్వుల హంగామా ఆడియెన్స్ ను మెప్పించింది. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో డైరక్టర్ అనుదీప్ కెవి జాతిరత్నాలు సీక్వల్ ఉంటుందని ఎనౌన్స్ చేశాడు.
జోగిపేట్ నుండి హైదరాబాద్ వెళ్లి రచ్చ చేసిన ఈ జాతిరత్నాలు. ఈసారి సెకండ్ పార్ట్ లో యూఎస్ లో హంగామా చేస్తారట. అనుదీప్ జాతిరత్నాలు పార్ట్ 2ని యూఎస్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. జాతిరత్నాలు కాస్టింగ్ ను రిపీట్ చేస్తూ ఈ సీక్వల్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి జాతిరత్నాలు పార్ట్ 2 యూఎస్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించడం క్రేజీగా ఉందని చెప్పొచ్చు.