అనుకున్న టైమ్ కే రాధే శ్యామ్ ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్దే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా పిరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటిస్తున్నారు. సినిమాను జూలైన్ 30న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రగ బాగా ఉండటంతో సినిమాలన్ని వాయిదా పడుతూ వస్తున్నాయి. థియేటర్ యాజమాన్యాలు థియేటర్లు బంద్ చేస్తున్నారు.

ఇలాంటి టైం లో రాధే శ్యామ్ అనుకున్న టైం వస్తుందా అంటే జూలైలో అనుకున్న టైం కు రాధే శ్యామ్ రిలీజ్ అవుతుందని అంటున్నారు చిత్రయూనిట్. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమాలు చేస్తున్నాడు.