
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా సరే కేసులు కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ పై మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన చేశారు. లాస్ట్ ఇయర్ కరోనా లాక్ డౌన్ టైం లో సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్ముకులకు నిత్యావసరాలు, మెడిసిన్స్ ఇచ్చి అండగా నిలిచిన సీసీసీ మరోసారి సినీ కార్మికులకు అండగా నిలుస్తుంది. అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో సినీ కార్మికులకు, సినీ జర్నలిస్ట్ లకు ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు చెప్పారు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో వీడియో ద్వారా ఈ మెసేజ్ అందించారు. ఏప్రిల్ 22 గురువారం నుండి నెల రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. సినీ పరిశ్రమలో 45 సంవత్సరాలు దాటిన వారు జీవిత భాగస్వామికి 45 ఏళ్లు దాటితే కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా పొందవచ్చని చిరు తెలిపారు. అర్హులైన వారు అసోసియేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.