
తేజా సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా జాంబి రెడ్డి. ఈ ఇయర్ వచ్చిన హిట్ సినిమాల్లో అది కూడా ఒకటి. అ! తో మెప్పించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ కల్కి సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టకపోయినా ప్రేక్షకులను మెప్పించాడు. జాంబి రెడ్డితో మరోసారి తన సత్తా చాటాడు. ఈ సినిమా తర్వాత తేజా సజ్జకి క్రేజ్ పెరిగింది. లేటెస్ట్ గా తేజ ఇష్క్ సినిమాతో రాబోతున్నాడు. ఇదిలాఉంటే మరోసారి జాంబి రెడ్డి కాంబో రిపీట్ అవబోతుందని తెలుస్తుంది.
ప్రశాంత్ వర్మ మరోసారి తేజాతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేశాడట. జాంబి రెడ్డి కాంబోతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. జాంబి రెడ్డి హిట్ అవడంతో ఆ సినిమా పార్ట్ 2 తీస్తానని చెప్పాడు ప్రశాంత్ వర్మ ఒకవేళ జాంబి రెడ్డి 2 కోసమే మరోసారి వీళ్లిద్దరు కలిసి చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. జాంబి రెడ్డి 2 సినిమాలో సమంత ని నటింపచేయాలని అనుకున్నారు ప్రశాంత్ వర్మ.