ఉప్పెన డైరక్టర్ 10 కోట్ల డిమాండ్..!

సుకుమార్ అసిస్టెంట్ గా పనిచేసి మొదటి సినిమా ఉప్పెనతో భారీ హిట్ అందుకున్నాడు బుచ్చి బాబు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించాడు. ఈ సినిమాకు అన్ని అంశాలు బాగా కలిసి వచ్చాయని చెప్పొచ్చు. ఇక ఉప్పెన సినిమా తర్వాత హీరో, హీరోయిన్ కు మాత్రమే కాదు డైరక్టర్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

మైత్రి మూవీ మేకర్స్ వారే బుచ్చి బాబుతో మరో రెండు సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నారట. బుచ్చి బాబుకి 10 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్న డైరక్టర్ గా బుచ్చి బాబు అదరగొడుతున్నాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ఓ సినిమా వస్తుందని అంటున్నారు. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.