
బుట్ట బొమ్మ పూజా హెగ్దే వరుస సినిమాలతో కెరియర్ సూపర్ స్వింగ్ లో ఉంది. అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇస్తుండటంతో స్టార్ సినిమా అంటే ముందు పూజా హెగ్దే డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఆమె కాదన్న తర్వాతే వేరే హీరోయిన్ కోసం చూస్తున్నారు. పూజా హెగ్దే సినిమాలో ఉంటే స్పెషల్ ఎట్రాషన్ గా గ్లామర్ షో ఉంటుంది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ ఆఫర్లను చేజిక్కించుకుంటుంది పూజా హెగ్దే. 9 ఏళ్ల తర్వాత కోలీవుడ్ లో విజయ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది పూజా హెగ్దే.
నెల్సన్ డైరక్షన్ లో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడు 3 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అయినా సరే అడిగినంత ఇచ్చి ఆమెను ఓకే చేసుకున్నారు నిర్మాతలు. స్టార్ సినిమా అయితే 2.75 కోట్లు, మీడియం రేంజ్ హీరో అయితే 3 కోట్లు డిమాండ్ చేస్తుంది పూజా హెగ్దే. సౌత్ లో 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దే స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది.