
RRR, ఆచార్య సినిమాల తర్వాత రాం చరణ్ శంకర్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లో కన్నడ భామ రష్మికకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కన్నడ కిరాక్ పార్టీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తెలుగులో ఛలోతో వచ్చి స్టార్ క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఛాన్సులు అందుకుంటున్న రష్మిక చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీలో కూడా సెలెక్ట్ అయ్యిందట.
ఈ సినిమాలో అమ్మడు జర్నలిస్ట్ గా నటిస్తుందని తెలుస్తుంది. చరణ్ తో రష్మిక మొదటిసారి జోడీ కడుతుంది. లాస్ట్ ఇయర్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో అమ్మడు తన మార్క్ చూపించాలని చూస్తుంది.