
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా నారప్ప చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక మరోపక్క ఎఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈమధ్యలో దృశ్యం 2 సినిమాను కూడా పూర్తి చేసేశాడు వెంకటేష్. అయితే నారప్ప సినిమా రష్ చూసిన నిర్మాత సురేష్ బాబు కొన్ని మార్పులు సూచించాడని తెలుస్తుంది.
నారప్ప సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా రష్ చూసిన చిత్రయూనిట్ కొన్ని మార్పులు చేయాలని అనుకున్నారట. కోలీవుడ్ లో అసురన్ ధనుష్ కు నేషనల్ అవార్డ్ సైతం తెచ్చిపెట్టింది. తెలుగులో ఈ సినిమాను ఎలా చేస్తారో చూడాలి. వెంకటేష్ నారప్ప, ఎఫ్3, దృశ్యం 3 సినిమాలు వరుస రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.