
కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత కె.ఎస్ రవింద్రా అలియాస్ బాబీ డైరక్షన్ లో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమధ్యనే లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఆ సినిమాతో పాటుగా బాబీ డైరక్షన్ లో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కోసం బాబీ ఠాగూర్ లాంటి కథ సిద్ధం చేశాడని టాక్.
చిరు కెరియర్ లో ఠాగూర్ సృష్టించిన సంచలనాలు తెలిసిందే. కోలీవుడ్ రమణ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా వినాయక్ డైరక్షన్ లో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు అలాంటి ఓ సోషల్ మెసేజ్ కథతోనే బాబీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ, వెంకటేష్ తో వెంకీమామ సినిమాలు చేసి హిట్ అందుకున్న బాబీ మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.