పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల తిరుపతి ప్రచారంలో పాల్గొన్న పవన్ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి కొద్దిగా నీరసించారు. అయితే ఒకసారి టెస్ట్ చేయించుకోగా నెగటివ్ అని తేలగా రెండు రోజులుగా కొద్దిగా జ్వరం, బాడీ పెయిన్స్ ఉండటంతో మరోసారి టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. 

ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేక వైద్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్ కు ట్రీట్ మెంట్ జరుగుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫాం హౌజ్ లో హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు.