స్టార్ కమెడియన్ కు హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషయం..!

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వివేక్ కు హార్ట్ ఎటాక్ రావడంతో చెన్నై లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ కు గుండెపోటు రావడం జరిగింది. ప్రస్తుతం వివేక్ కు ఎక్మో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు సమాచారం. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యక్షిస్తున్నట్టు తెలుస్తుంది. వివేక్ కు గుండెపోటు రావడంతో కోలీవుడ్ షాక్ కు గురైంది. వివేక్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు తమిళ సినీ ప్రియులు. అయితే వివేక్ ఆరోగ్య పరిస్థితి విషయంగానే ఉందని తెలుస్తుంది. కోలీవుడ్ సెలబ్రిటీస్ సైతం వివేక్ హార్ట్ ఎటాక్ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.