మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ ముందుకొస్తుందా..?

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా లేటెస్ట్ గా ఆర్.ఎఫ్.సీలో మరో షెడ్యూల్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాను త్వరగా పూర్తి చేసి ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మే నుండి సెప్టెంబర్ వరకు వరుస సినిమా రిలీజ్ లు ఉన్నాయి. అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల కొన్ని సినిమాలు రిలీజ్ వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో సమ్మర్ సినిమాలు దసరాకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి అలాంటి టైం లో మహేష్ దసరాకి రిలీజ్ పెట్టుకునే అవకాశం లేదు.

పరశురాం తర్వాత త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుంది. త్రివిక్రం సినిమా కూడా త్వరగానే పూర్తి చేసే ఉద్దేశంతో పరశురాం సినిమాను త్వరగా ఫినిష్ చేసి ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ చేసేలా మహేష్ ఆలోచిస్తున్నాడట. మరి అది సాధ్యపడుతుందో లేదో చూడాలి.