
నందమూరి బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ కు అదే మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది. మాస్ మహరాజ్ రవితేజ తో క్రాక్ హిట్ అందుకున్న కిరాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ సినిమా బాలయ్య బాబుతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. క్రాక్ ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. అయితే అదే సెంటిమెంట్ తో బాలకృష్ణ సినిమాలో కూడా వేటపాలెం బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తుంది.
క్రాక్ సినిమా కథ పాతదే అయినా గోపీచంద్ మలినేని మాస్ ట్రీట్మెంట్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. మరో బోయపాటి అనిపించేసుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య బాబుతో తీసే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అనుకోవచ్చు. మాస్ హీరో సూపర్ మాస్ డైరక్టర్ కలిసే చేసే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.