
మాస్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటుగా తేజ డైరక్షన్ లో అలివేలుమంగ వెంకట రమణ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో గోపీచంద్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. కవలలుగా పుట్టి చిన్నప్పుడే విడిపోయి 30 ఏళ్ల తర్వాత కలుస్తారట. అందులో ఒకరు హీరో, ఒకరు విలన్ గా కనిపిస్తారట. కథ పాతదే అయినా తేజ మార్క్ స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి గోపీచంద్ హిట్ కొట్టే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా వరుస ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.