తేజ 'ఇష్క్' ట్రైలర్..!

తేజా సజ్జా హీరోగా ఎస్.ఎస్ రాజు డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇష్క్.. ట్యాగ్ లైన్ గా ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అని పెట్టారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ లో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా టైటిల్ తో వస్తున్నా ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని అంటున్నారు. సినిమా టైటిల్ ఇష్క్ అని పెట్టినా సినిమాలో లవ్ స్టోరీ ఉండదని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

టైటిల్ లానే లవ్ స్టోరీగా మొదలై మధ్యలో సస్పెన్స్ కలిగిస్తూ సినిమా కొత్తగా ఉందనిపిస్తుంది. సినిమాలో తేజా సరసన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 23 న నాని టక్ జగదీష్ రిలీజ్ వాయిదా వేసుకోగా తేజ సజ్జా ఇష్క్ ఆ డేట్ న వస్తుంది. రీసెంట్ గా జాంబి రెడ్డి సినిమాతో హిట్ అందుకున్న తేజ సజ్జా ఇష్క్ సినిమాపై కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మెగా సూపర్ హిట్ మూవీస్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.