
మళయాళంలో సూపర్ హిట్టైన దృశ్యం సినిమాను తెలుగులో రీమేక్ చేశారు విక్టరీ వెంకటేష్. ఆరేళ్ల క్రితం దృశ్యం హిట్ అందుకోగా ఈమధ్య మళయాళంలో దృశ్యం 2 రిలీజై హిట్ కొట్టింది. దృశ్యం చేసిన వెంకటేష్ దృశ్యం 2ని చేస్తున్నారు. ఈసారి మళయాళ మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ తెలుగు దృశ్యం 2ని డైరెక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు విక్టరీ వెంకటేష్.
దృశ్యం 2లో తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారట వెంకటేష్. అదే విషయాన్ని సురేష్ ప్రొడక్షన్ యూనిట్ వెల్లడించింది. అసలైతే జూన్ లో దృశ్యం 2 రిలీజ్ ప్లాన్ చేశారు. కాని కరోనా వల్ల మళ్లీ వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో దృశ్యం 2 కూడా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. దృశ్యం 2తో పాటుగా వెంకటేష్ అసురన్ రీమేక్ గా నారప్ప సినిమా చేస్తున్నాడు. వీటితో పాటుగా సూపర్ హిట్ మూవీ ఎఫ్2కి సీక్వల్ గా ఎఫ్3లో కూడా నటిస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఎఫ్3 సినిమాలో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.