ప్రభాస్ రాధే శ్యామ్ రీ షూట్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ రిలీజ్ టార్గెట్ అనుకున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా మరింత వెనక్కి వెళ్లేలా ఉంది. ఇక ఇదిలాఉంటే రాధే శ్యామ్ రషెస్ చూసిన ప్రభాస్ సినిమాలో కొన్ని సీన్స్ రీ షూట్స్ చేయాలని కోరాడట. నిర్మాతలు కూడా అందుకు సరే అన్నట్టు టాక్.

జిల్ సినిమాతో గోపీచంద్ కు స్టైలిష్ మూవీ ఇచ్చిన రాధాకృష్ణ ప్రభాస్ తో ఓ అద్భుతమైన ప్రేమ కథను చెబుతున్నాడు. రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ ఇవన్ని ప్రత్యేకంగా ఉంటున్నాయి. మరి సినిమా రీ షూట్స్ ఎందుకు చేస్తున్నారో ఏమో కాని తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పించేలా రాధే శ్యామ్ ఉంటుందని చెప్పొచ్చు.