వాయిదా పడ్డ విరాటపర్వం..!

రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడిగుల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అసలైతే ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. విరాటపర్వంతో పాటుగా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాను వాయిదా వేస్తున్నామని ఈమధ్యనే ప్రకటించారు. ఏప్రిల్ 23న నాని కూడా టక్ జగదీష్ గా రావాల్సి ఉంది కాని ఆ సినిమా కూడా వాయిదా వేశారు.

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజై సూపర్ హిట్ కాగా ఆ తర్వాత రాబోయే సినిమాలన్ని వాయిదా వేశారు. అయితే ఇదే వాయిదాల పర్వం మే నెలలో కూడా కొనసాగుతుందా అన్నది వేచిచూడాలి. మే నెలలో రావాల్సిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. మే 13న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆగష్టుకి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.