ఎన్టీఆర్ సినిమా కోసం అల్లు అర్జున్ వెనక్కి..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ చేసుకుని కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా కొరటాల శివ డైరక్షన్ లో తారక్ సినిమా ఉంటుంది. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రాం తో పాతుగా మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత అసలైతే అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది కాని ఆ సినిమా కన్నా ముందు ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో మూవీ ఏప్రిల్ 29, 2022 రిలీజ్ ప్రకటించారు. సెట్స్ మీదకు వెళ్లకుండానే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఈ సినిమా పూర్తి చేశాక అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ గ్యాప్ లో త్రివిక్రం మహేష్ తో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.