
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజైంది. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు. వకీల్ సాబ్ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అయితే సినిమా ఓటీటీలో రాబోతుందని వస్తున్న వార్తలన్ని నిజం కాదని తేల్చి చెప్పారు. స్టార్ సినిమాలు ఏవైనా 50 రోజుల తర్వాతనే ఓటీఓటీలో వస్తాయని. వకీల్ సాబ్ కూడా 50 రోజుల తర్వాతనే ఓటీటీలో వస్తుందని అన్నారు.
వకీల్ సాబ్ సినిమాను ఓన్ చేసుకున్న మహిళలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాగా వకీల్ సాబ్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ గా వచ్చినె ఈ సినిమాను పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా బాగా తీశారు డైరక్టర్ వేణు శ్రీరాం. సినిమా చూసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ మహేష్, చిరంజీవి లాంటి వారు కూడా సినిమాను ప్రశంసించారు.