
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీస్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ వీరాభిమాని బండ్ల గణేష్ కు మరోసారి కరోనా ఎటాక్ అయినట్టు తెలుస్తుంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించిన బండ్ల గణేష్ అప్పటినుండి మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు.
లైట్ ఫీవర్ గా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బండ్ల గణేష్ అపోలో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్ ను ఐసియులో ఉంచినట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురిచి వివరాలు బయటకు రావాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో మొదట కరోనా బారిన పడ్డది కూడా బండ్ల గణేషే. అయితే తనకు నెగటివ్ వచ్చాకా ఆ రిపోర్ట్ ను సోషల్ మీడియాలో పెట్టి నానా హడావిడి చేశాడు బండ్ల గణేష్.