
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమాకు అఖండ టైటిల్ ఫిక్స్ చేశారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు.
కొన్నాళ్లుగా ఈ సినిమా టైటిల్ పై ఉన్న కన్ ఫ్యూజన్ తొలగిపోయింది. ఇక అఖండ టీజర్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ మాస్ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో ఓ పాత్రలో బాలయ్య బాబు అఘోరా లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. అఖండగా బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. ఆమధ్య పంచెకట్టుతో డైలాగ్ టీజర్ తో మెప్పించిన నందమూరి నట సింహం ఈసారి మరో డైలాగ్ టీజర్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచాడు.